Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, October 10, 2013

నిర్గమకాండము 27

Exo 27:1  మరియు అయిదు మూరల పొడుగు అయిదు మూరల వెడల్పుగల బలిపీఠమును తుమ్మకఱ్ఱతో నీవు చేయ వలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను; దాని యెత్తు మూడు మూరలు.
Exo 27:2  దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలెను; దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను; దానికి ఇత్తడి రేకు పొదిగింప వలెను.
Exo 27:3  దాని బూడిదె ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉప కరణములన్నియు ఇత్తడితో చేయవలెను.
Exo 27:4  మరియు వలవంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను.
Exo 27:5  ఆ వలమీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమివరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాని నుంచవలెను.
Exo 27:6  మరియు బలిపీఠముకొరకు మోతకఱ్ఱలను చేయవలెను. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను.
Exo 27:7  ఆ మోతకఱ్ఱలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకఱ్ఱలు దాని రెండుప్రక్కల నుండ వలెను.
Exo 27:8  పలకలతో గుల్లగా దాని చేయవలెను; కొండమీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలెను.
Exo 27:9  మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున, అనగా దక్షిణదిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగుగలదై పేనిన సన్న నార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను.
Exo 27:10  దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి; ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.
Exo 27:11  అట్లే పొడుగులో ఉత్తర దిక్కున నూరు మూరల పొడుగుగల యవనికలుండ వలెను. దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి. ఆ స్తంభముల వంకులును వాటి పెండె
Exo 27:12  పడమటిదిక్కున ఆవరణపు వెడల్పు కొరకు ఏబది మూరల యవనికలుండవలెను; వాటి స్తంభ ములు పది వాటి దిమ్మలు పది.
Exo 27:13  తూర్పువైపున, అనగా ఉదయదిక్కున ఆవరణపు వెడల్పు ఏబది మూరలు.
Exo 27:14  ఒక ప్రక్కను పదునైదు మూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.
Exo 27:15  రెండవ ప్రక్కను పరునైదుమూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలును మూడు.
Exo 27:16  ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల యిరువది మూరల తెర యుండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను; వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మలు నాలుగు.
Exo 27:17  ఆవరణముచుట్టున్న స్తంభములన్నియు వెండి పెండెబద్దలు కలవి; వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఇత్తడివి.
Exo 27:18  ఆవరణపు పొడుగు నూరు మూరలు; దాని వెడల్పు ఏబదిమూరలు దాని యెత్తు అయిదు మూరలు; అవి పేనిన సన్ననారవి వాటి దిమ్మలు ఇత్తడివి.
Exo 27:19  మందిరసంబంధమైన సేవోపకర ణములన్నియు మేకులన్నియు ఆవరణపు మేకులన్నియు ఇత్తడివై యుండవలెను.
Exo 27:20  మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీ యుల కాజ్ఞాపించుము.
Exo 27:21  సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులును సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు యెహోవా సన్నిధిని దాని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరములవరకు నిత్యమైన కట్టడ.

No comments:

Post a Comment