Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, October 10, 2013

నిర్గమకాండము 1

Exo 1:1  ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేరులు ఏవనగా, రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను బెన్యామీను.
Exo 1:2  దాను నఫ్తాలి గాదు ఆషేరు.
Exo 1:3  వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను.
Exo 1:4  యాకోబు గర్భమున పుట్టినవారందరు డెబ్బదిమంది.
Exo 1:5  అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను.
Exo 1:6  యోసేపును అతని అన్నదమ్ములందరును ఆ తరము వారంద రును చనిపోయిరి.
Exo 1:7  ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి; వారున్న ప్రదేశము వారితో నిండి యుండెను.
Exo 1:8  అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్తరాజు ఐగు ప్తును ఏల నారంభించెను.
Exo 1:9  అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇశ్రాయేలు సంతతియైన యీ జనము మనకంటె విస్తారముగాను బలిష్ఠముగాను ఉన్నది.
Exo 1:10  వారు విస్తరింప కుండునట్లు మనము వారియెడల యుక్తిగా జరిగించుదము రండి; లేనియెడల యుద్ధము కలుగునప్పుడుకూడ మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధముచేసి యీ దేశములోనుండి, వెళ్లిపోదురేమో అనెను.
Exo 1:11  కాబట్టి వారిమీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారిమీద నియ మింపగా వారు ఫరోకొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామెసేసను పట్టణములను కట్టిరి.
Exo 1:12  అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టినకొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల యెడల అసహ్య పడిరి.
Exo 1:13  ఇశ్రాయేలీయులచేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి;
Exo 1:14  వారు ఇశ్రాయేలీయులచేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతిపనిలోను కఠినసేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి.
Exo 1:15  మరియు ఐగుప్తురాజు షిఫ్రా పూయా అను హెబ్రీ యుల మంత్రసానులతో మాటలాడి
Exo 1:16  మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసానిపని చేయుచు వారిని కాన్పుపీటల మీద చూచినప్పుడు మగవాడైనయెడల వాని చంపుడి, ఆడుదైనయెడల దాని బ్రదుకనియ్యుడని వారితో చెప్పెను.
Exo 1:17  అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఐగుప్తురాజు తమ కాజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రదుకనియ్యగా
Exo 1:18  ఐగుప్తురాజు ఆ మంత్రసానులను పిలి పించిమీరెందుకు మగపిల్లలను బ్రదుకనిచ్చితిరి? ఈ పని యేల చేసితిరి అని అడిగెను.
Exo 1:19  అందుకు ఆ మంత్రసానులుహెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలవంటివారు కారు; వారు చురుకైనవారు. మంత్రసాని వారియొద్దకు వెళ్లక మునుపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి.
Exo 1:20  దేవుడు ఆ మంత్రసానులకు మేలుచేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను.
Exo 1:21  ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను.
Exo 1:22  అయితే ఫరోహెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రదుకనియ్యుడి అని తన జనులందరికి ఆజ్ఞాపించెను.

No comments:

Post a Comment