Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, October 10, 2013

నిర్గమకాండము 11

Exo 11:1  మరియు యెహోవా మోషేతో ఇట్లనెనుఫరో మీదికిని ఐగుప్తుమీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటుతరువాత అతడు ఇక్కడనుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడనుండి మిమ్మును బొత్తిగా వెళ్లగొట్టును.
Exo 11:2  కాబట్టి తన చెలికానియొద్ద ప్రతి పురుషుడును తన చెలి కత్తెయొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసికొనుడని ప్రజలతో చెప్పుము.
Exo 11:3  యెహోవా ప్రజలయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను; అదిగాక ఐగుప్తుదేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను.
Exo 11:4  మోషే ఫరోతో ఇట్లనెనుయెహోవా సెలవిచ్చిన దేమనగామధ్యరాత్రి నేను ఐగుప్తుదేశములోనికి బయలు వెళ్లెదను.
Exo 11:5  అప్పుడు సింహాసనముమీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్లవరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లలందరును చచ్చెదరు; జంతు వులలోను తొలిపిల్లలన్నియు చ
Exo 11:6  అప్పుడు ఐగుప్తు దేశమందంతట మహా ఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇకమీదట పుట్టదు.
Exo 11:7  యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచు నని మీకు తెలియబడునట్లు, మనుష్యులమీదగాని జంతు వులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు.
Exo 11:8  అప్పుడు నీ సేవకులైన వీరందరు నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసినీవును, నిన్ను ఆశ్రయించియున్న యీ ప్రజలంద రును బయలు వెళ్లుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్లుద
Exo 11:9  అప్పుడు యెహోవాఐగుప్తుదేశములో నా మహ త్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను.
Exo 11:10  మోషే అహరోనులు ఫరో యెదుట ఈ మహత్కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశములోనుండి ఇశ్రాయేలీయులను పోనియ్య డాయెను.

No comments:

Post a Comment